దాయాది దేశం పాకి​స్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సయీద్‌ అహ్మద్‌ (86) అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. డాషింగ్‌ బ్యాటర్‌గా పేరున్న అహ్మద్‌ పాక్‌ తరఫున 41 టెస్ట్‌లు ఆడి ఐదు సెంచరీలు, 16 హాఫ్‌ సెంచరీల సాయంతో 2991 పరుగులు చేశాడు. రైట్‌ ఆర్మ్ ఆఫ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన అహ్మద్‌ పాక్‌ తరఫున 22 వికెట్లు పడగొట్టాడు. 1958లో వెస్టిండీస్‌తో జరిగిన బ్రిడ్జ్‌టౌన్‌ టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అహ్మద్‌.. తన స్వల్ప కెరీర్‌లో మూడు మ్యాచ్‌ల్లో పాక్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.1972-73 ఆస్ట్రేలియా టూర్‌లో అహ్మద్‌ తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ (మెల్‌బోర్న్‌) ఆడాడు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)