ఐపీఎల్ వేలం జరుగుతుండగా వేలం నిర్వహించే అధికారి Hugh Edmeades కళ్లు తిరిగి కిందపడిపోయిన సంగతి విదితమే. ప్రస్తుతానికి అతనికి ఏమి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని బిడ్డింగ్ రూ. 3.30కు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ కోసం పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పోటీపడుతున్న సమయంలో ఆక్షనీర్‌ ఎడ్మెడేస్‌ కింద పడిపోయారు. దీంతో వెంటనే వేలం నిలిపివేశారు.

ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ ఎడ్మెడేస్‌ ఆరోగ్యంపై అప్‌డేట్‌ ఇచ్చింది. ‘‘ఆక్షనీర్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తిరిగి వేలంలో పాల్గొంటారు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. క్రికెట్‌ ప్రజెంటర్‌ గౌతమ్‌ భీమాని సైతం ఎడ్మడేస్‌ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపాడు. ఆయనకు ఎటువంటి సమస్యలు లేవని పేర్కొన్నాడు. కాగా వేలం తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)