ప్రపంచకప్‌లో భారత బౌలర్లు ప్రతి మ్యాచ్ లో దుమ్మురేపుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఐసీసీ, బీసీసీఐలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారంటూ నిరాధారమైన వ్యాఖ్యలు చేశాడు. ఇలా జరగడం వల్లే భారత పేసర్లు ఇతర బౌలర్లతో పోలిస్తే అధిక సీమ్‌ను, స్వింగ్‌ను రాబట్టగలుగుతున్నారని తెలిపాడు.ఈ విషయమై సమగ్ర తనిఖీలు జరగడంతో పాటు విస్తృత స్థాయి చర్చ జరగాలని కోరాడు. 1996-2005 మధ్యలో పాక్ తరఫున 7 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడిన హసన్ రజా.. అతిపిన్న వయసులో (14 ఏళ్ల 233 రోజులు) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వీడియో ఇదిగో..
Here's Video
ICC Might Give Different Ball to Indian Bowlers thats why they are Getting Seam and Swing More Than Others.Ex Test Cricketer Hasan Raza.#CWC23 #INDvSL pic.twitter.com/7KCQoaz0Qs
— Hasnain Liaquat (@iHasnainLiaquat) November 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)