వెస్టిండీస్‌తో ఉత్కంఠంగా సాగిన రెండో వన్డేలో యువ భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా భారత జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ వన్డే సిరీస్ విజయం. 2006 తర్వాత ఇండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌లలో ఏ ఒక్కటి కూడా టీమిండియా ఓడలేదు. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య జరిగిన 12 వన్డే సిరీస్‌లనూ భారత్ నెగ్గింది.

రెండో వన్డేలో బౌలింగ్‌లో విఫలమైనా భారత బ్యాటర్లు పట్టుదలతో ఆడి ఇండియాకు విజయాన్ని అందించారు. 312 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రేయాస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54)తో పాటు చివర్లో అక్షర్ పటేల్ (35 బంతుల్లో 64 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)