సఫారీ అండర్‌–19 మహిళల జట్టుతో ఆరో టి20 మ్యాచ్‌లో భారత అండర్‌–19 మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బుధవారం జరిగిన చివరిదైన మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 4–0తో దక్కించుకుంది. ప్రిటోరియా వేదికగా జరిగిన టీ20లో టాస్‌ గెలిచిన ఆతిథ్య దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి 13.2 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్‌ అమ్మాయి యషశ్రీ 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది.మిగతా వాళ్లలో.. ఫలక్‌ నాజ్, సోనమ్‌ యాదవ్, పార్షవి చోప్రా రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం భారత్‌ 9.2 ఓవర్లలో 3 వికెట్లకు 55 పరుగులు చేసి నెగ్గింది. కెప్టెన్‌ షఫాలీ వర్మ (22; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హైదరాబాద్‌ అమ్మాయి గొంగడి త్రిష (10 నాటౌట్‌; 1 ఫోర్‌) రాణించారు.

Team India Woman U19 (Photo-BCCI)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)