టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్.
అసలు నువ్వు ఎందుకూ పనికిరావు, ఈజీ క్యాచ్ మిస్ చేయడంపై మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
తొంభై రెండేళ్ల ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
INDIA 46 ALL OUT AGAINST NEW ZEALAND 🤯🤯🤯
This is their lowest total in Test history on home soil 🇮🇳💔💔#INDvNZ #tapmad #DontStopStreaming pic.twitter.com/88YcBwhrHa
— Farid Khan (@_FaridKhan) October 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)