ఐసీసీ టీ20 క్రికెట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ సూర్యకుయార్ యాదవ్ దుమ్ములేపాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అతడు ఏకంగా 44 స్థానాలు ఎగబాకాడు. మొత్తంగా 732 పాయింట్లు సాధించిన సూర్య.. కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఇంగ్లండ్‌తో టీమిండియా టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ మొదటి టీ20లో 39 పరుగులు, రెండో మ్యాచ్‌లో 15 పరుగులు, మూడో టీ20 మ్యాచ్‌లో 117 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది తొలి సెంచరీ. సూర్య మినహా మరే ఇతర టీమిండియా బ్యాటర్‌కు టాప్-10లో చోటు దక్కించుకోలేదు.
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్
1.బాబర్ ఆజమ్(పాకిస్తాన్)- 818 పాయింట్లు
2. మహ్మద్ రిజ్వాన్(పాకిస్తాన్)- 794 పాయింట్లు
3.ఎయిడెన్ మార్కరమ్(దక్షిణాఫ్రికా)- 757 పాయింట్లు
4. డేవిడ్ మలన్(ఇంగ్లండ్)- 754 పాయింట్లు
5. సూర్యకుమార్ యాదవ్(ఇండియా)- 732 పాయింట్లు
6.ఆరోన్ ఫించ్(ఆస్ట్రేలియా)- 716 పాయింట్లు
7. డెవాన్ కాన్వే(న్యూజిలాండ్)- 703 పాయింట్లు
8.నికోలస్ పూరన్(వెస్టిండీస్)- 667 పాయింట్లు
9.పాథుమ్ నిశాంక(శ్రీలంక)- 661 పాయింట్లు
10. మార్టిన్ గఫ్టిల్(న్యూజిలాండ్), రసీ వాన్ డెర్ డసెన్(దక్షిణాఫ్రికా)- 658 పాయింట్లు.
A huge climb for Suryakumar Yadav in T20I cricket, as Dimuth Karunaratne reaches a career-high ranking on the Test scene!
More on the latest @MRFWorldwide rankings 📈
— ICC (@ICC) July 13, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)