ఉప్ప‌ల్ టెస్టులో అనూహ్యంగా ఓట‌మి పాలైన టీమిండియా(Team India) వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టులో అద్భుత‌ విజ‌యం సాధించింది. 106 ప‌రుగుల‌తో రోహిత్ సేన ప్ర‌తీకారం తీర్చుకుంది. నాలుగో రోజు భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ఇంగ్లండ్ 292 ప‌రుగుల‌కు ఆలౌట‌య్యింది. టామ్ హ‌ర్ట్లే(36)ను భారత స్పీడ్ గన్ బుమ్రా బౌల్డ్ చేసి భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు. ఈ గెలుపుతో టీమిండియా 1-1తో సిరీస్ స‌మం చేసింది.ఓవ‌ర్‌నైట్ స్కోర్ 67/1తో నాలుగో రోజు ఆట మొద‌లెట్టిన ఇంగ్లండ్ 292 పరుగుల వద్ద తన ప్రస్థానం ముగించింది.

జాక్‌ క్రాలే (73) హాఫ్ సెంచరీ సాధించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (3/46), రవిచంద్రన్ అశ్విన్ (3/72) అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మూడో టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌ వేదికగా ప్రారంభం కానుంది.

స్కోరు వివరాలు: 

భారత్: తొలి ఇన్నింగ్స్‌ 396/10. రెండో ఇన్నింగ్స్‌ 255/10

ఇంగ్లాండ్‌: తొలి ఇన్నింగ్స్‌ 253/10. రెండో ఇన్నింగ్స్‌ 292/10

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)