భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్‌ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్‌ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు. విరాట్‌ కోహ్లికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించగా... స్పిన్‌తో భారత్‌కు సిరీస్‌ విజయాన్నిచ్చిన బౌలింగ్‌ ద్వయం అశ్విన్‌–రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)