రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కొత్త కెప్టెన్‌ వచ్చేశాడు. అంతా ఊహించినట్లుగానే దక్షిణాఫ్రికా స్టార్‌ ఆటగాడు ఫఫ్ డుప్లెసిస్‌కు ఆర్సీబీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ మేరకు బెంగళూరులో నిర్వహించిన "ఆర్సీబీ ఆన్‌బాక్స్‌" ఈవెంట్‌లోఈ విషయాన్ని బెంగళూరు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో భాగంగా ఫఫ్ డు ప్లెసిస్‌ను ఆర్సీబీ రూ. 7కోట్లకు కొనుగోలు చేసింది. ఇక గతంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున ఆడిన డు ప్లెసిస్‌ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌-2021 సీజన్‌లో 633 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా డు ప్లెసిస్ నిలిచాడు. గత ఏడాది చెన్నై టైటిల్‌ గెలవడంలో డు ప్లెసిస్‌ కీలక పాత్ర పోషించాడు. ఇక ప్రొటీస్ జట్టు తరఫున 37 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. 23 మ్యాచ్‌లలో విజయాలు అందుకున్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)