కేఎల్ రాహుల్‌కు మళ్లీ షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో కోత పడింది. రాహుల్‌కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై కూడా ఐపీఎల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హజిల్‌వుడ్ బౌలింగ్ వేసే సమయంలో ఫీల్డ్ అంపైర్‌తో స్టోయినిస్ వాగ్వాదానికి దిగాడు. వైడ్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి తప్పుగా భావించి మేనేజ్‌మెంట్ అతడిని మందలించి వదిలేసింది. ఆ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో రాహుల్ జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి. ముంబైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు.
IPL 2022: LSG skipper KL Rahul fined for Code of Conduct breach
Read @ANI Story | https://t.co/jKTWHFJ9F7#IPL2022 #IPL #LSG #KLRahul pic.twitter.com/RHFPaSDXqD
— ANI Digital (@ani_digital) April 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)