శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్‌గా... కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా ఆట తీరును మెరుగుపరచుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. తాజాగా ఓ అమ్మాయి అతనికి షాకిచ్చింది. పై ఫొటోలో కనిపించే అమ్మాయి మాత్రం అందరిలాంటి అభిమాని కాదు. ఆమెకు శ్రేయస్ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం. అంతేనా.. వీలైతే అతడిని తన జీవిత భాగస్వామిగా పొందాలన్న ఆరాటం. అందుకే తనకు శ్రేయస్ మీద ఉన్న ప్రేమను బహిరంగంగానే ప్రకటించింది ఈ అమ్మాయి.
‘‘అబ్బాయిని వెతుక్కోమని మా అమ్మ చెప్పింది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయస్ అయ్యర్?’’ అన్న అక్షరాలు రాసి ఉన్న ప్లకార్డుతో ఆమె.. అయ్యర్‌కు పెళ్లి ప్రపోజల్ పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కేకేఆర్ తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ క్రమంలో.. ‘అయ్యర్ భాయ్ నో చెప్తాడు. ఎందుకంటే తన దృష్టి మొత్తం ఇప్పుడు ఆట మీదే ఉంది. అయినా నువ్వు ఎవరమ్మా? భలేగా ప్రపోజ్ చేశావు!’’ అంటూ శ్రేయస్ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
That's one way of shooting your shot! 👏#KKRHaiTaiyaar #RRvKKR #IPL2022 pic.twitter.com/FDaO7VOXdx
— KolkataKnightRiders (@KKRiders) April 18, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)