సౌతాఫ్రికా లెజండరీ ఆల్‌రౌండర్ జాక్విస్ కలిస్ ఐపీఎల్ ప్రారంభానికి ముందే టైటిల్ ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పేశాడు. ఈసారి ఫైనల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్-ఢిల్లీ కేపిటల్స్  మధ్య జరుగుతుందని.. ఢిల్లీ కేపిటల్స్ కప్పును ఎగరేసుకుపోతుందని కలిస్ జోస్యం చెప్పాడు. ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటి వరకు ట్రోఫీ సాధించలేదు. ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఢిల్లీ కేపిటల్స్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020లలో టైటిళ్లు సాధించింది. ఇక, గత సీజన్‌లో ఢిల్లీ ఏడు మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. జాక్విస్ కలిస్ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 2008 నుంచి 2010 వరకు ఆడాడు. ఆ తర్వాత మూడేళ్లపాటు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కేకేఆర్ జట్టులో కలిస్ సభ్యుడు.

Here's Update

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)