ఐపీఎల్ కు దీటుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను తీర్చిదిద్దుతామని, వచ్చే ఏడాది నుంచి తాము సైతం ఆటగాళ్ల వేలం నిర్వహించాలని అనుకుంటున్నట్టు పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా (Ramiz Raja) చేసిన ప్రకటనపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) స్పందించాడు. పీఎస్ ఎల్ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఏ ఇతర క్రికెట్ లీగ్ అయినా, బిగ్ బాష్ లీగ్ సహా ఐపీఎల్ స్థాయిని అందుకోలేదు. భారత్ లో ఐపీఎల్ కు భారీ వీక్షకులు ఉండడమే కాదు. ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న లీగ్ ఐపీఎల్’’అంటూ ఐపీఎల్ తో పోటీపడడం ఎవరి తరమూ కాదన్నట్టు ఆకాశ్ చోప్రా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
PSL వేలం జరిగినా అక్కడ ఏ ఆటగాడు కూడా 16 కోట్ల ధరకు విక్రయించబడడు అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యకు చోప్రా బదులిచ్చారు. PSLలో 16 కోట్లకు అమ్ముడుపోయిన ఆటగాడు మీరు చూడలేరు. అది సాధ్యం కాదు. మార్కెట్ డైనమిక్స్ అలా జరగడానికి అనుమతించదు. అంత సింపుల్ గా" అని తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు.
"You will not see a player playing for Rs 16 crores in the PSL"
Aakash Chopra reacts to PCB chief Ramiz Raja's claim about PSL's value matching IPL | #IPL2022 #PSL #Cricket https://t.co/8g7dpTduqu
— India Today Sports (@ITGDsports) March 17, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)