ఇంగ్లండ్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్ మ్యాచ్ ఆండర్సన్ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన జేమ్స్ ఆండర్సన్ ఈ ఫార్మాట్‌లో తన 704వ వికెట్‌ను సాధించాడు. అతను ట్రేడ్‌మార్క్ అవుట్-స్వింగింగ్ డెలివరీతో జాషువా డా సిల్వాను అవుట్ చేశాడు. . క్రికెట్ చరిత్రలో ముగిసిన యోధుడి ప్రస్థానం, టెస్ట్ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన జేమ్స్ అండర్సన్, ఎమోషనల్ అయిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్
సుదీర్ఘ కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో 401 మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 991 వికెట్లు పడగొట్టాడు. అయితే వీటిలో అత్యధికం టెస్టుల్లో వచ్చినవే. రెడ్ బాల్ క్రికెట్‌లో 704, వన్డేల్లో 269, టీ20ల్లో 18 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5 బౌలర్ల జాబితాలో అండర్సన్ ఒకడు. 188 మ్యాచుల్లో 704 వికెట్లు పడగొట్టిన జిమ్మీ మూడో స్థానంలో నిలిచాడు. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో టాప్‌లో ఉండగా.. 708 వికెట్లు తీసిన దివంగత షేన్ వార్న్(ఆస్ట్రేలియా) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619), ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్(604)లు వరుసగా నాలుగు, ఐదో ప్లేస్‌లో నిలిచారు.
Here's Video
Jimmy Anderson at his 𝘃𝗲𝗿𝘆 best ✨#EnglandCricket | @Jimmy9 pic.twitter.com/98i7Uythss
— England Cricket (@englandcricket) July 12, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)