టి20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడని బీసీసీ వర్గాలు నుంచి వచ్చిన సమాచారం. అసలే బౌలింగ్‌ అంతంతమాత్రంగా ఉన్న దశలో ఇలా బుమ్రా గాయంతో దూరమవడం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఇక సౌతాఫ్రికాతో తొలి టి20కి బుమ్రాను రెస్ట్‌ పేరుతో పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి బుమ్రా జట్టుతో పాటు తిరువనంతపురంకు రాలేదని సమాచారం.ఆస్ట్రేలియాతో మూడో టి20 మ్యా్‌చ్‌ అనంతరం బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రాను బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీకి పంపించినట్లు తెలుస్తోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)