న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌కు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. దీంతో ఇంగ్లండ్‌తో జ‌ర‌గాల్సిన రెండ‌వ టెస్టుకు కేన్ దూరం కానున్నాడు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌డంతో.. విలియ‌మ్‌స‌న్ గురువారం రాపిడ్ యాంటీజెన్ ప‌రీక్ష చేయించుకున్నాడు. ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చింది. దీంతో విలియ‌మ్‌స‌న్ అయిదు రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్నారు. శుక్ర‌వారం నుంచి నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో రెండ‌వ టెస్టు ప్రారంభంకానున్న‌ది. అయితే మిగితా ప్లేయ‌ర్లు అంద‌రూ కోవిడ్ ప‌రీక్ష‌లో నెగ‌టివ్ వ‌చ్చారు. తొలి టెస్టులో కివీస్ ఓడిన విష‌యం తెలిసిందే. విలియ‌మ్‌స‌న్ స్థానంలో టామ్ లాథ‌మ్ కెప్టెన్సీ ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. కొత్త‌గా హ‌మిష్ రూథ‌ర్‌ఫోర్డ్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)