ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్‌ మార్కో జాన్సెన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు సాధించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్‌ 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. లక్ష్య చేధన సమయంలో ప్రత్యర్థి జట్టుకు ఒక బౌలర్‌ తన కోటా ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు లుంగి ఎన్గిడి ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 2019లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 62 పరుగులిచ్చి చెత్త రికార్డును నమోదు చేశాడు. తాజాగా ఆ రికార్డును ఒక పరుగు(4 ఓవర్లలో 63 పరుగులు) ఎక్కువ ఇవ్వడం ద్వారా​మార్కో జాన్సెన్‌ బద్దలు కొట్టాడు. కాగా మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌పై ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలింగ్‌ కోచ్‌ మురళీధరన్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)