ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది. కాగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (రూ. 16 కోట్లు), స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (రూ. 8 కోట్లు), వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ (రూ. 6 కోట్లు)ను రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా ఇషాన్‌ను వదులుకోవాల్సి వచ్చింది. అయితే, మెగా వేలంలో మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. హైదరాబాద్‌తో పోటీ పడి రికార్డు ధరకు అతడిని కొనుగోలు చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)