ప్రముఖ ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ (Australian Cricketer) ఫవాద్‌ అహ్మద్‌ (Fawad Ahmed) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన నాలుగు నెలల చిన్నారి అనారోగ్యంతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు (Death Of 4-Month Old Son). ఈ విషయాన్ని ఫవాద్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.సుదీర్ఘ పోరాటం తర్వాత బాధాకరమైన, కఠినమైన పోరాటంలో నా చిన్నారి దేవదూత ఓడిపోయాడు. మేము తనని చాలా మిస్‌ అవుతున్నాం. నువ్వు స్వర్గానికి వెళ్లావని భావిస్తున్నా. ఎవరూ ఇలాంటి బాధను అనుభవించకూడదని ఆశిస్తూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ పోస్ట్‌ చేశారు. ఈ మేరకు చిన్నారి ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు.

ఫవాద్‌ అహ్మద్‌ భార్య ఈ ఏడాది జూన్‌లో రెండో సంతానం కింద పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు బాబు పుట్టినప్పటి నుంచి పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో మెల్‌బోర్న్‌లోని రాయల్‌ చిల్డ్రన్స్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో బాబు ఆరోగ్యం క్షీణించడంతో ఈనెల 23న ప్రాణాలు కోల్పోయినట్లు ఫవాద్‌ తెలిపారు.

Here's His Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)