క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడం గొప్ప. అలాంటిది ఆరు బాల్స్ కు ఆరు వికెట్లు తీసే.. అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.. మలేషియా క్లబ్ ఎలెవెన్‌కు చెందిన వీరన్‌దీప్ సింగ్ అనే బౌలర్ ఆరు బాల్స్ వేసి ఆరు వికెట్లు తీశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి వీరన్‌దీప్ సింగ్ తీసింది ఐదు బంతుల్లో ఐదు వికెట్లు.. ఇక ఆరో వికెట్ రనౌట్ రూపంలో వచ్చింది. వీరన్‌దీప్ సింగ్ ఐదు వికెట్ల క్లబ్‌లో జాయిన్ అయినప్పటికి ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించడమనేది గొప్ప విషయం.నేపాల్ ప్రొ కప్ టి20 చాంపియన్‌షిప్‌లో భాగంగా మలేషియా క్లబ్ ఎలెవెన్ వర్సెస్ పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ మధ్య జరిగింది.
వీరన్‌దీప్ సింగ్ బౌలింగ్‌కు రాకముందు పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ స్కోరు 131-3.. అతని ఓవర్ పూర్తయ్యేసరికి 132-9గా మారిపోయింది. ఓవర్ తొలి బంతిని వైడ్ వేశాడు. ఆ తర్వాత రెండో బంతికి రనౌట్.. ఆ తర్వాత మిగిలిన ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇందులోనే వీరన్‌దీప్ సింగ్ హ్యట్రిక్ నమోదు చేయడం విశేషం. మొత్తానికి వీరన్‌దీప్ సింగ్ రెండు ఓవర్లు వేసి 8 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్ క్యారీ క్లబ్ క్రికెట్‌లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీశాడు. ఇందులో మొదటి వికెట్ స్లిప్ క్యాచ్, తర్వాతి రెండు వికెట్లు క్యాచ్, ఎల్బీ రూపంలో.. ఇక చివరి మూడు వికెట్లు క్లీన్‌బౌల్డ్ రూపంలో సాధించాడు.
2⃣0⃣th Over
6⃣ Balls
6⃣ Wickets
4⃣ in 4⃣ from the final 4 for the bowler
1⃣ Run Out
Unbelievable stuff from @Viran23 for the @MalaysiaCricket XI here in Bhairahawa, Nepal!
Surely the first time in Cricket History there's been 6 Wickets in 6 Balls!?? pic.twitter.com/pVIsdlyEwt
— Andrew Leonard (@CricketBadge) April 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)