భారత క్రికెట్ జట్టు ఇటీవల అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం విదితమే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ ప్రవేశపెట్టింది.
జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్) లోగోను, ఎడమవైపు టీమ్ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని ఉంటుంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి.
ఇక వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించింది. అలాగే టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా కుదించింది. రెండు నక్షత్రాలు భారత్ రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని పేర్కొంది.
Here's News
Captain Rohit Sharma with Indian team jersey for World Cup 2023.
Team India is ready for #WorldCup2023🔥🇮🇳#CWC2023 #TeamIndia pic.twitter.com/TF5Aj9uwlj
— Ishan Joshi (@ishanjoshii) September 20, 2023
Virat Kohli, Rohit Sharma, Siraj and Gill in the new Tri-Colour stripes Indian jersey for the World Cup.
Dream XI will be removed from the front and only India will be seen on the jersey! pic.twitter.com/KgGIDHMX0z
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)