వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. తద్వారా సెమీఫైనల్‌ బెర్త్‌ను కివీస్‌ దాదాపు ఖారారు చేసుకుంది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు నాలుగో జట్టుగా కివీస్‌ అర్హత సాధించే ఛాన్స్‌ ఉంది. అయితే అఫ్గానిస్తాన్‌- దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ల ఫలితాల తర్వాత సెమీస్‌కు వచ్చే నాలుగో జట్టు ఏదో అధికారికంగా తేలనుంది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది.ట్రెంట్‌ బౌల్ట్‌ 3 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్‌, శాంట్నర్‌, రచిన్‌ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్‌ పెరెరా(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో థీక్షణ(38) పరుగులతో రాణించాడు.172 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్‌ బ్యాటర్లలో ఓపెనర్లు(45), రచిన్‌ రవీంద్ర(42) పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. మిచెల్‌(43) పరుగులతో విజయాన్ని అందించాడు. లంక బౌలర్లలో మాథ్యూస్‌ రెండు వికెట్లు సాధించగా.. థీక్షణ,చమీరా ఒక్క వికెట్‌ పడగొట్టారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)