భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రపంచంలోని అత్యుత్తమ టెస్ట్ క్రికెటర్లు జాబితాను విడుదల చేశాడు. ప్రపంచంలోని టాప్ ఫైవ్ టెస్ట్ క్రికెటర్లను ఎంచుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భజ్జీకి ఓ ప్రశ్న ఎదురైంది. " ప్రస్తుతం ప్రపంచటెస్టు క్రికెట్‌లో ఐదుగురు బెస్ట్ ప్లేయర్స్ ఎవరు? స్కిల్స్ మాత్రమే కాకుండా గేమ్ ఛేంజర్స్, మ్యాచ్ విన్నర్లు, కీలక సమయాల్లో బాగా ఆడినవారిని పరిగణలోకి తీసుకుని చెప్పండి" అని ఓ ట్విటర్ యూజర్ ప్రశ్నించాడు.
అందుకు బదులుగా భజ్జీ.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు నాథన్ లయాన్, స్టీవ్ స్మిత్, టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్, మరో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ఎంచుకున్నాడు. కాగా భజ్జీ ఎంచుకున్న టాప్ ఫైవ్ ప్లేయర్స్‌లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ పాటు నెం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటుదక్కపోవడం గమానార్హం.
Here's Tweet
Nathan lyon
Steav Smith
Rishab Panth
Ravinder Jadeja
Ben strokes https://t.co/joWrcVEE9X
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 3, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)