ఢిల్లీ క్యాపిట‌ల్స్ సార‌ధి రిష‌బ్ పంత్ తీరుపై టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఘాటు విమ‌ర్శ‌లు చేశాడు. టిమ్ డేవిడ్ విష‌యంలో రివ్యూ అడ‌గ‌క పోవ‌డాన్ని త‌ప్పు బ‌ట్టాడు. టిమ్ డేవిడ్ వంటి విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ ప‌రుగులు చేయ‌కుండానే ఔట‌య్యే అవ‌కాశం వ‌స్తే ఉప‌యోగించుకోరా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఇంకా ఐదు ఓవ‌ర్లే ఉన్నా.. రెండు స‌మీక్ష‌ల‌ను వాడుకోవాల‌నే క‌నీస ప‌రిజ్ఞానం కూడా ఢిల్లీ సార‌ధి రిష‌బ్ పంత్‌కు తెలియ‌దా? అని మండి ప‌డ్డాడు. బంతి టిమ్ డేవిడ్ బ్యాట్ అంచును తాకి నేరుగా కీప‌ర్ చేతుల్లో ప‌డిన‌ప్పుడు పంత్ వ‌దిలేస్తే మిగ‌తా ప్లేయ‌ర్లు ఏం చేశార‌ని నిల‌దీశాడు. అప్పటికి మ్యాచ్‌లో ఇంకా ఐదు ఓవ‌ర్లు, రెండు రివ్యూలు ఉన్నాయ‌ని గుర్తు చేశాడు. టిమ్ డేవిడ్ ఔట‌యి ఉంటే ఢిల్లీ గెలుపొందేద‌న్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)