మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చిన్ రవీంద్ర టెస్ట్ క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ యువ ఎడమచేతి వాటం ఆటగాడు, కేవలం నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, ఈ మార్కును అందుకున్న నాల్గవ కివీస్ ఆటగాడుగా నిలిచాడు.

ప్రస్తుతం రవీంద్ర 222 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 5 వికెట్ల నష్టానికి 437 పరుగలు చేసింది. క్రీజులో రవీంద్రతో పాటు గ్లెన్‌ ఫిలిప్స్‌ ఉన్నాడు. మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేన్‌(118) పరుగులు చేశాడు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)