టీమిండియా హెడ్ కోచ్ గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో ద్రావిడ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ద్రావిడ్ స్పందిస్తూ... రవిశాస్త్రి కోచ్ గా టీమిండియా అద్భుతమైన విజయాలను సాధించిందని కితాబునిచ్చారు. ఆటగాళ్లందరి సహకారంతో విజయాల పరంపరను తాను కూడా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)