Rahul Dravid Tests Positive for Covid: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా, ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం, ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19కి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో అతను 2022 ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. కాంటినెంటల్ టోర్నమెంట్ కోసం భారత జట్టు యుఎఇకి బయలుదేరడానికి ముందు ఈ పరిణామం జరిగింది.

Rahul Dravid Tests Positive for Covid: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా, ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం, ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు
Rahul Dravid (Photo Credits :ICC)

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోవిడ్-19కి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో అతను 2022 ఆసియా కప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. కాంటినెంటల్ టోర్నమెంట్ కోసం భారత జట్టు యుఎఇకి బయలుదేరడానికి ముందు ఈ పరిణామం జరిగింది. 3 మ్యాచ్‌ల ODI సిరీస్ కోసం జింబాబ్వేకు వెళ్లిన భారత బృందంలో ద్రవిడ్ లేడు. ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు.

టోర్నీ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు భారత జట్టులోని ఇతర సభ్యులు యుఎఇకి చేరుకున్నారని కూడా తెలిసింది. తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే భారీ మ్యాచ్‌కు మూడు రోజుల ముందు భారత జట్టు దుబాయ్‌లో శిక్షణ ప్రారంభించనుంది. KL రాహుల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, దీపక్ హుడా వంటి మరికొందరు ఆటగాళ్లు జింబాబ్వేతో వన్డే సిరీస్ అయిపోయిన తర్వాత దుబాయ్‌లో దిగనున్నారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 23, 2022 10:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).