రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా బ్యాటింగ్ లో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో (33/3) ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ క్రమంలో జడ్డూ కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా 198 బంతుల్లో 7 ఫోర్లు, 2స సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును తాకాడు.

326/5 స్కోర్‌ వద్ద తొలి రోజు ఆట ముగిసింది. జడేజా (110), కుల్దీప్‌ యాదవ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (10), శుభ్‌మన్‌ గిల్‌ (0), రజత్‌ పాటిదార్‌ (5) నిరాశపరిచగా.. కెప్టెన్‌ రోహిత్‌ సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మార్క్‌ వుడ్‌ 3, టామ్‌ హార్ల్టీ ఓ వికెట్‌ పడగొట్టారు.

Here's BCCI Tweet 

Here's Century Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)