టీమిండియా తరఫున టీ20లలో అదరగొడుతున్న యువ బ్యాటర్ రింకూ సింగ్ సారీ చెప్పాడు. ఇంతకీ విషయం ఏంటంటే..పందొమ్మిదవ ఓవర్లో మార్క్రమ్ బౌలింగ్‌లో రింకూ స్ట్రెయిట్ హిట్ కారణంగా సైట్స్క్రీన్ బ్రేక్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం స్పందించిన రింకూ సింగ్.. స్టేడియం నిర్వాహకులకు క్షమాపణలు చెప్పాడు.
ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో తన ప్రదర్శన గురించి మాట్లాడుతున్న సమయంలో.. ‘‘ఆ బంతిని సిక్సర్‌గా మలచాలని మాత్రమే భావించాను. నా షాట్ కారణంగా అద్దం పగిలిపోయిందని నాకు తెలియదు. ఆ విషయం గురించి ఇప్పుడే తెలిసింది. గ్లాస్ బ్రేక్ చేసినందుకు సారీ చెబుతున్నా’’ అని రింకూ సింగ్ పేర్కొన్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘సో క్యూట్ రింకూ.. నీ ఆటతోనే కాదు అమాయకత్వపు, హుందాతనపు మాటలతోనూ మా మనసులు దోచుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Here's Video
Maiden international FIFTY 👌
Chat with captain @surya_14kumar 💬
... and that glass-breaking SIX 😉@rinkusingh235 sums up his thoughts post the 2⃣nd #SAvIND T20I 🎥🔽 #TeamIndia pic.twitter.com/Ee8GY7eObW
— BCCI (@BCCI) December 13, 2023
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                             
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
