భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా పంత్ కారు ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. వేగంగా దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. ఇక ఆ తర్వాత కారుకు మంటలు అంటుకోగా.. అగ్నికి ఆహుతైపోయింది. పంత్ స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.ప్రమాద సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడు. ఉదయం సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులో ఉన్న కారణంగా తన కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు పంత్ చెప్పాడని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు.
Here's Video
CCTV footage of Rishabh Pant uncontrolled car colliding with divider...exact time of collision is 5:21am#RishabhPantAccident #RishabhPant #CCTV pic.twitter.com/mp6pV4izHf
— Sachin Singh (@sachinsingh1010) December 30, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)