టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా.. ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు.ఇంగ్లండ్ తో కొద్దిరోజుల క్రితమే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టులో పంత్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్ పై టెస్టులతో పాటు వన్డేలలో కూడా సెంచరీలు చేసిన జాబితాలో గతంలో శ్రీలంక వికెట్ కీపర్ కుమార సంగక్కర కూడా ఉన్నాడు. సంగక్కర టెస్టులలో ఇంగ్లండ్ పై రెండు సెంచరీలు, రెండు వన్డే శతకాలు బాదాడు. కానీ టెస్టులలో అతడు సెంచరీలు చేసినప్పుడు ప్రసన్న జయవర్దెనే వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో టెస్టులలో అతడు చేసిన సెంచరీలు కేవలం ఆటగాడిగా చేసినట్టుగానే నమోదయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)