టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.
అసలు నువ్వు ఎందుకూ పనికిరావు, ఈజీ క్యాచ్ మిస్ చేయడంపై మండిపడుతున్న నెటిజన్లు, వీడియో ఇదిగో..
ఈ మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడ్డాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి బాల్ బలంగా తాకింది. కివీస్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో రవీంద్ర జడేజా వేసిన ఆఖరి బంతిని ఆడేందుకు డెవాన్ కాన్వే ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బాల్ ఆఫ్ స్టంప్ మీదుగా వెళ్లి పంత్ మోకాలిని తాకగా.. నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలో టీమిండియా ఫిజియోలు వచ్చి పంత్‌ను పరీక్షించారు.అయితే, బాధ తాళలేక పంత్ గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతడు మైదానం వీడాడు. ఈ క్రమంలో పంత్ సబ్‌స్టిట్యూట్‌గా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకున్నాడు.
Rishabh Pant Limps Off The Field After Injuring..
Rishabh Pant walks out of field !
He was hit one the knee while keeping .
Praying for his well being , Hopefully he will be back soon
🙏❤️#RishabhPant pic.twitter.com/thkfn2z6yp
— Riseup Pant (@riseup_pant17) October 17, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)