టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా హిట్‌మ్యాన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు.కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో గల రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియా- కివీస్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ బుధవారం ఆరంభమైంది.

భారత ఇన్నింగ్స్‌ ఆరంభించిన రోహిత్‌.. మూడో ఓవర్‌లో కివీస్‌ బౌలర్‌ హెన్రీ షిప్లే బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్‌ దిశగా సిక్సర్‌ బాదాడు. ఈ క్రమంలో ధోని పేరిట ఉన్న రికార్డును హిట్‌మ్యాన్‌ సవరించాడు. ఆ తర్వాత ఐదో ఓవర్‌ నాలుగో బంతికి మరోసారి షిప్లే బౌలిం‍గ్‌లోనే రోహిత్‌ సిక్స్‌ బాదాడు. కివీస్‌తో తొలి వన్డేలో మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ 34 పరుగులు(4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. టిక్నర్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)