ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భారత సారథి రోహిత్‌ శర్మ.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.24 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌ 6 ప్రపంచకప్‌లు ఆడి.. ఆరు శతకాలు తన పేరిట లిఖించుకోగా.. రోహిత్‌ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరాడు.2019లో ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లోనే 5 శతకాలు బాది అద్భుతాలు చేసిన రోహిత్‌.. బుధవారం అఫ్గాన్‌పై మరో మూడంకెల స్కోరుతో మాస్టర్‌ను వెనక్కి నెట్టాడు.

శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర ఐదు సెంచరీలతో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మహమ్మద్‌ నబీ వేసిన 18 ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్‌ కొట్టి 99 పరుగులకు చేరుకున్న హిట్‌మ్యాన్‌.. తర్వాతి బంతికి సింగిల్‌ తీసి శతకం పూర్తి చేసుకున్నాడు.కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డే ప్రపంచకప్‌లో ఇదే అత్యంత వేగవంతమైన శతకం కాగా.. ఓవరాల్‌గా మెగాటోర్నీలో రోహిత్‌కు ఇది ఏడో సెంచరీ.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)