వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారిగా సోషల్‌మీడియా ముందుకు వచ్చి ఓ వీడియో ద్వారా స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలో రోహిత్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమిని ఎలా అధిగమించాలో ఇప్పటికీ తెలియట్లేదని హిట్‌మ్యాన్‌ వాపోయాడు. ఆ ఓటమి తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నాడు. అభిమానుల ఆశలను అడియాశలు చేయడం ఎంతో బాధించిందని తెలిపాడు.ఆ మనోవేదనను అధిగమించి మైదానంలో​కి తిరిగి ఎలా అడుగుపెట్టాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వరుసగా పది మ్యాచ్‌ల్లో గెలిచి, పైనల్లో ఓడిపోవడాన్ని జీర్ణించుకకోలేకపోతున్నానని తెలిపాడు.

Here's Video

 

View this post on Instagram

 

A post shared by Team Ro (@team45ro)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)