స్కాట్లాండ్‌ బౌలర్‌ అలస్డేర్‌ ఇవాన్స్‌(Alasdair Evans) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. పదిహేనేళ్ల తన ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. 2009లో కెనడాతో వన్డే మ్యాచ్‌తో ఇవాన్స్‌ స్కాట్లాండ్‌ తరఫున అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 42 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో ఈ పేస్‌ బౌలర్‌ 58, 41 వికెట్లు తీశాడు. చివరగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫయర్స్‌లో శ్రీలంక తరఫున మ్యాచ్‌ ఆడాడు. దాదాపు ఏడాది కాలంగా జట్టుకు దూరమైన అతడు..తాజాగా ఆటకు వీడ్కోలు పలుకుతూ ప్రకటన విడుదల చేశాడు.సుదీర్ఘకాలం పాటు కెరీర్‌ కొనసాగించేందుకు సహకరించిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, అభిమానులకు ఈ సందర్భంగా ఇవాన్స్‌ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టమని పేర్కొన్నాడు.

బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లుండి కుప్పకూలిన యువ బాక్సర్, ఆస్పత్రికి వెళితే బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపిన వైద్యులు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)