ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఉదయం ఆసీస్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతితో విషాదంలో ఉన్న క్రికెట్ వర్గాలను తాజాగా వార్న్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్న్ గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
షేన్ వార్న్ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్ ప్రపంచంలో లెజెండ్. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్ లక్ష్మణ్ సంతాపం తెలిపారు.
This is absolutely unbelievable. Shocked beyond words. A legend and one of the greatest players ever to grace the game..
Gone too soon... Condolences to his family and friends. https://t.co/UBjIayR5cW
— VVS Laxman (@VVSLaxman281) March 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)