వెస్టిండీస్ క్రికెటర్ షిమ్రాన్ హిట్‌మేయర్ టీ20 వరల్డ్‌కప్ జట్టు నుంచి ఔటయ్యాడు.హిట్‌మేయర్ స్థానంలో వరల్డ్‌కప్ జట్టులో షామ్రా బ్రూక్స్ ఆడనున్నట్లు ఐసీసీకి వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీనిపై ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. నిజానికి హిట్‌మేయర్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు .. ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన విమానాన్ని రీషెడ్యూల్ చేసింది. ఫ్యామిలీ కారణాల చేత అక్టోబర్ ఒకటో తేదీన విమానాన్ని అందుకోలేనన్నాడు. దీంతో అక్టోబర్ మూడో తేదీన అతని కోసం మరో విమానంలో సీటు బుక్ చేశారు. అయితే సోమవారం కూడా అతను సరైన సమయానికి చేరుకోలేదని, దీంతో అతన్ని తుది జట్టు నుంచి తప్పించినట్లు వెస్టిండీస్ బోర్డు తెలిపింది.
Shimron Hetmyer has been ruled out of the T20 World Cup 2022 due to a bizarre incident.#ShimronHetmyer #WestIndies #T20I #T20Is #T20WorldCup2022 #T20WC2022 #T20WC #T20WorldCup #Cricket #CricketWinner pic.twitter.com/BebNVBEycA
— Cricket Winner (@cricketwinner_) October 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)