టీ20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్ శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో కనీస పోరాటం లేకుండానే చేతులెత్తేసింది. సౌతాఫ్రికా బౌలర్లు సమిష్టిగా రాణించగా నిప్పులు చెరిగే బంతులుతో విజృంభించిన పేసర్ అన్రిచ్ నోకియా (4/7) సంచలన స్పెల్‌కు లంకేయులు విలవిల్లాడారు. ఫలితంగా దక్షిణాఫ్రికా.. 6 వికెట్ల తేడాతో హసరంగ సేనపై ఘనవిజయం సాధించింది. సఫారీ బౌలర్ల ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన లంక.. 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా సైతం తడబాటుకు లోనై విజయం కోసం 16.2 ఓవర్లు ఆగాల్సి వచ్చింది. క్వింటన్ డికాక్ (27 బంతుల్లో 20, 1 సిక్స్), క్లాసెన్ (22 బంతుల్లో 19 నాటౌట్, 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.
Here's News
PROTEAS WIN! ✅ | #SLvSA #WozaNawe #BePartOfIt #OutOfThisWorld #T20WorldCup
— Proteas Men (@ProteasMenCSA) June 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)