వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా దసున్‌ షనక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది.అతడితో పాటు మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక కూడా రీ ఎంట్రీ ఇచ్చారు.రిజర్వ్‌ జాబితాలో దసున్‌ హేమంత, చమిక కరుణ రత్నేకు ఛాన్స్‌ లభించింది. ప్రధాన టోర్నీలో శ్రీలంక తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 7న ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక(కెప్టెన్‌), కుసల్ మెండిస్ (వైస్‌ కెప్టెన్‌), పాతుమ్ నిస్సంక, కుసల్ జనిత్, దిముత్ కరుణరత్నే, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వ, సదీర సమరవిక్రమ, దునిత్ వెల్లలగే, కసున్ రజిత, మతీశ పతిరన, లహిరు కుమార, మహేశ్ తీక్షన, వశీన్ తీక్షన మధుశంక ప్రయాణ నిల్వలు: దుషన్ హేమంత, చమిక కరుణరత్నే

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)