2023 సంవత్సరపు అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు చోటు దక్కలేదు.భారత యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు కల్పించింది. సూర్యతో కలుపుకుని ఐసీసీ జట్టులో మొత్తం నలుగురు భారత ఆటగాళ్లకు చోటు లభించింది.
యశస్వికి జతగా ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసిన ఐసీసీ.. వన్‌డౌన్‌లో విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్‌మన్, ఆల్‌రౌండర్ల కోటా జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, ఉగాండ ప్లేయర్ అల్పేష్ రంజనీ, స్పెషలిస్ట్ బౌలర్లుగా మార్క్ అడైర్ (ఐర్లాండ్), రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే)లను ఎంపిక చేసింది. ఐసీసీ ఈ జట్టులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి ఒక్క ఆటగాడిని కూడా ఎంపిక చేయకపోవడం విశేషం.
Here's ICC T20I Team of the Year 2023 Team
A mixture of youth and experience make up the ICC Men's T20I Team of the Year 2023 🙌
Details ➡️ https://t.co/BWgwdpaspp pic.twitter.com/2uztdSgsJE
— ICC (@ICC) January 22, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)