జోహన్నెస్‌బర్గ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ బౌలర్లకు సూర్య భాయ్ చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 100 పరుగులు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు శతకాలు బాదిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 57 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 79 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు.కాగా సూర్యకు ఇది నాలుగో టీ20 సెంచరీ కావడం విశేషం. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు (18)చేసిన రోహిత్ శర్మ(4), గ్లేన్ మ్యాక్స్‌వెల్(4) సరసన సూర్య నిలిచాడు.మ్యాక్స్‌వెల్ తన నాలుగు సెంచరీల మార్క్‌ను 92 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు.అదే విధంగా దక్షిణాఫ్రికా గడ్డపై టీ20ల్లో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ కూడా సూర్యనే కావడం గమనార్హం
Here's News
Back to back Fifty for Captain Suryakumar Yadav..!!!
He smashed 51* runs 32 balls against South Africa in final T20I match - What a fifty by Surya! pic.twitter.com/YchIyY0EkA
— CricketMAN2 (@ImTanujSingh) December 14, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)