ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఘోర ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు.

అదే సమయంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని తలచుకుంటున్నారు. అందరి కంటే ‘మిస్టర్‌ కూల్‌’ బెటరంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో #captaincy హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీమిండియా కెప్టెన్సీని స్వచ్చందంగా రోహిత్‌ వదులుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లిని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆట పట్ల అతడి అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని గట్టిగా చెబుతున్నారు. బౌలింగ్‌ బలంగా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిందని కొంతమంది పేర్కొంటున్నారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)