టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీలు వచ్చాయి. బ్లూ కలర్ లోనే కొత్త డిజైన్ తో జెర్సీలను రూపొందించారు. అభిమానుల ఆకాంక్షలకు ప్రతిరూపాలు పేరిట ఈ జెర్సీలను రూపొందించినట్టు బీసీసీఐ పేర్కొంది. వీటిని బిలియన్ చీర్స్ జెర్సీలుగా బోర్డు అభివర్ణించింది. టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ లో పాల్గొంటున్నారు. ఈ నెల 15తో ఐపీఎల్ ముగియనుంది. ఆ తర్వాత రెండ్రోజులకే, అంటే, ఈ నెల 17న టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐపీఎల్ కు ఆతిథ్యమిస్తున్న యూఏఈ గడ్డపైనే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. కొత్త జెర్సీలతో టీమిండియా దూసుకుపోవాలని అభిమానులు సందేశాలు పంపుతున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)