టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విశ్వరూపం చూపించిన సంగతి విదితమే. మొత్తం 167 పరుగులతో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 110 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్్ ప్రపంచంలో కోహ్లీ సరికొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ తో తన అంతర్జాతీయ కెరీర్‌లో 46 సెంచరీ నమోదు చేశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకు విరాట్‌ కోహ్లి కెరీర్‌లో ఇది 74 అంతర్జాతీయ సెంచరీ.కాగా కింగ్ కోహ్లీ శ్రీలంక మీద ఇది వరుసగా పదో సెంచరీ.

ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్‌ వరల్డ్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండ్కూలర్‌తో కలిసి విరాట్‌ సమంగా ఉన్నాడు.ఆస్ట్రేలియాపై స‌చిన్ 9 సెంచ‌రీలు చేయగా.. విరాట్‌ కూడా వెస్టిండీస్‌పై 9 సెంచ‌రీలు చేశాడు. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్‌ కోహ్లి(10).. సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేశాడు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)