అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో విరాట్ కోహ్లీ పతనాల పరంపర కొనసాగుతోంది. ఐర్లాండ్‌పై 1, పాకిస్థాన్‌పై 4 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ.. వరుసగా మూడవ మ్యాచ్‌లోనూ అమెరికాపై మ్యాచ్‌‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ నేత్రవల్కర్ వేసిన ఓవర్‌లో తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీ20లలో కోహ్లీ 6వసారి డకౌట్ అయ్యాడు. టీ20లలో కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటివరకు ఏకంగా 12 సార్లు డకౌట్ అవ్వగా.. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండవ భారత క్రికెటర్‌గా కోహ్లీ

Here's Video

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)