టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది.  ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో రిష‌బ్ పంత్ అత్య‌ధికంగా 20 ప‌రుగులు చేయ‌గా, అయిదుగురు బ్యాట‌ర్లు డ‌కౌట్ అయ్యారు. కోహ్లీ, స‌ర్ఫ‌రాజ్‌, జ‌డేజా, కేఎల్ రాహుల్‌, అశ్విన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. కివీస్ బౌల‌ర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీసుకోగా, రౌర్కీ 4 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. స్వంత గ‌డ్డ‌పై భార‌త్ జ‌ట్టు ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. టెస్టుల్లో అతి త‌క్కువ ప‌రుగుల‌కు ఇండియా నిష్క్ర‌మించ‌డం ఇది మూడ‌వ‌సారి.

అయిదుగురు స్టార్ బ్యాటర్లు వరుసగా డ‌కౌట్‌, రిష‌బ్ పంత్ ఆ 20 పరుగులు చేయకుండా ఉంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా..

Virat Kohli Wicket Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)