కరాచీ వేదికగా పాకిస్తాన్‌తో నిన్న (జనవరి 11) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 79 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఊహించని పరిణామం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సమయంలో (39వ ఓవర్‌లో)పాక్‌ ఆటగాడు మహ్మద్‌ వసీం జూనియర్‌ వికెట్లకు గురిపెట్టి విసిరిన ఓ త్రో ఫీల్డ్‌ అంపైర్‌ అలీం దార్‌ కాలికి బలంగా తాకింది. బంతి తాకిడికి చిర్రెత్తిపోయిన అంపైర్‌, చేతిలో ఉన్న పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ జెర్సీని నేలకేసి కొట్టాడు. ఆతర్వాత గ్రౌండ్‌లో ఉన్న పాక్‌ ఆటగాళ్లు అంపైర్‌ కాలిని రుద్దుతూ సేవలు చేశారు. ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డే సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)