ఐపీఎల్ 2022లో భాగంగా సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ సమయంలో కేఎల్ రాహుల్ తొలి ఓవర్‌లోనే తన షూను పోగొట్టుకున్నాడు. వాస్తవానికి మ్యాచ్ జరుగుతున్న ముంబైలో అధిక వేడిమి కారణంగా కేఎల్ రాహుల్‌కు చెమట విపరీతంగా వచ్చింది. దీంతో పిచ్‌పై పరిగెత్తుతున్న సమయంలో కేఎల్ రాహుల్ షూ పిచ్ మధ్యలో పడిపోయింది. ఇది గమనించినప్పటికి కేఎల్ రాహుల్ తన పరుగు పూర్తి చేశాడు. ఆ తర్వాత డికాక్ అతని షూ తీసుకొని వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
KL Rahul 😝 #IPL2022 #CSKvsLSG pic.twitter.com/yYb5BT1mXM
— Amanpreet Singh (@AmanPreet0207) March 31, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)